గేమ్ ఛేంజర్‌’ను అధిగమించిన డాకు మహారాజ్ !

సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్ కి నిజంగా పెద్ద పండుగే. అందుకే, భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్‌ గా బరిలోకి దిగుతాయి. మూడు నాలుగు భారీ సినిమాలు ఒకే వారంలో వచ్చినా అన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా “డాకు మహారాజ్”. అలాగే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ ‘గేమ్ ఛేంజర్’.

ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతి సీజన్‌లో స్పెషల్ సినిమాలుగా వచ్చాయి. ఐతే, గేమ్ ఛేంజర్ కి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ కి ఎబౌవ్ ఏవరేజ్ టాక్ వచ్చింది. దీంతో, డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. గత 24 గంటల్లో, టికెట్ బుకింగ్స్ లో బుక్‌మైషోలో డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్‌ ను అధిగమించింది. గేమ్ ఛేంజర్ కి 234.75K టిక్కెట్లు బుక్ అవ్వగా, డాకు మహారాజ్ కి 291.48K టిక్కెట్లు బుక్ అయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు